Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:29 PM

ప్రభుత్వ విద్య బలోపేతానికి చర్యలు చేపట్టాలి. ప్రైవేట్ ఫీజుల దోపిడీని అరికట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్.

10-07-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ రామన్నపేట మండలంలో విజయవంతమైంది. మండలంలోని పలు గ్రామాల్లో విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతులను బహిష్కరించి బంద్‌కు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేయడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడంతో పాటు తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, ఫర్నిచర్, డిజిటల్ బోధన వంటి మౌలిక సదుపాయాలను తక్షణమే కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రైవేట్ విద్యాసంస్థలు నియంత్రణ లేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని విమర్శించారు. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యను వ్యాపార వస్తువుగా మార్చే విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన, ఉచిత, సమాన విద్య అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. మండలంలో నిర్వహించిన బంద్‌కు డీవైఎఫ్‌ఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు పెద్ది అక్షిత, మండల నాయకులు పిట్టల నవీన్, తుర్కపల్లి లోకేష్, బూడిద ఆదిత్య, అప్పం అభిరూప్, నవదీప్, భూక్య సంతోష్, లోకేష్ శివమణి, నాగటి, చందు, నరేష్, జస్వంత్, సంజయ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ విద్య బలోపేతానికి చర్యలు చేపట్టాలి. ప్రైవేట్ ఫీజుల దోపిడీని అరికట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News