Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:12 PM

పెద్దకాపర్తి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్

05-07-2026 244 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూలై 5: తెల్లవారుజామున చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని నల్గొండ జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) శరత్ చంద్ర పవార్ సందర్శించారు.

ప్రమాదంపై పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఎస్పీ, ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ప్రమాద స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రతా చర్యల అమలుపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఎస్పీ, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ చేపట్టి, సమగ్ర నివేదిక సమర్పించాలని పోలీసు అధికారులకు సూచించారు.

ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

పెద్దకాపర్తి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్

Article Image

చిట్యాల, జూలై 5: తెల్లవారుజామున చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని నల్గొండ జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) శరత్ చంద్ర పవార్ సందర్శించారు.

ప్రమాదంపై పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఎస్పీ, ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ప్రమాద స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రతా చర్యల అమలుపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఎస్పీ, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ చేపట్టి, సమగ్ర నివేదిక సమర్పించాలని పోలీసు అధికారులకు సూచించారు.

ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News