Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:28 AM

గొట్టిపర్తిని నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి;బహుజన ప్రజా సమితి డిమాండ్

11-08-2026 411 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

గొట్టిపర్తిని నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని బహుజన ప్రజా సమితి (బీపీఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు గొట్టిపర్తి నూతన మండల కేంద్రం ఏర్పాటు సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు బీపీఎస్ అధ్యక్షుడు అడ్వకేట్ చింతకుంట్ల హరిబాబు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...

గొట్టిపర్తి మండల కేంద్రంగా ఏర్పాటైతే పరిసర గ్రామాల ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు. జలాల్ పురం, రావులపల్లి తండా, రాఘవపురం, రావులపల్లి, గొట్టిపర్తి, మామిడాల, మానాపురం తండ తదితర గ్రామాల ప్రజలకు పరిపాలనా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

నూతన మండల కేంద్రం ఏర్పాటుతో మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్, ఆసుపత్రి, విద్యాసంస్థలు, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.అదేవిధంగా వారాంతపు అంగడి ఏర్పాటుతో పాటు కొత్త దుకాణాలు, వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

కొత్త రహదారుల నిర్మాణంతో ప్రాంతీయ అభివృద్ధి వేగవంతమవుతుందని, భూముల విలువ పెరగడంతో పాటు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు, ఇతర నిత్యావసరాలు స్థానికంగానే లభించే అవకాశం ఉంటుందని అన్నారు.గొట్టిపర్తిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం కేవలం పరిపాలనా సౌకర్యం మాత్రమే కాదు.. చుట్టుపక్కల గ్రామాల సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే నిర్ణయం అని బహుజన ప్రజా సమితి నాయకులు పేర్కొన్నారు.

సాధన కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం

గొట్టిపర్తి నూతన మండల కేంద్రం ఏర్పాటు సాధన కమిటీ ఆధ్వర్యంలో నేడు గొట్టిపర్తి గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించే కార్యక్రమానికి ప్రజలు, యువత, రైతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చింతకుంట్ల నాగేష్, పరమేష్, తడకమల్ల యాకయ్య, అవిలయ్య, సురేష్, అశోక్, బన్నీ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తిని నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి;బహుజన ప్రజా సమితి డిమాండ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News