Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:02 PM

చేయూత పింఛన్లకు కొత్త దరఖాస్తుల స్వీకరణ. ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి: ఎంపీడీవో ఏ. రాములు.

11-08-2026 356 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, ఆగస్టు 11: తెలంగాణ ప్రభుత్వం చేయూత సామాజిక భద్రత పింఛన్ల కింద కొత్త పింఛన్లు మంజూరు చేయనున్న నేపథ్యంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని రామన్నపేట ఎంపీడీవో ఆర్. రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలి దశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్‌సెల్‌ వ్యాధి, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వైకల్యాలతో బాధపడుతున్న వారికి చేయూత పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే గ్రామపంచాయతీ లేదా వార్డు కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. గతంలో దరఖాస్తు చేయని వారు, అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించని వారు సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.ఆగస్టు 31, 2026 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ఏ . రాములు కోరారు.

Sthanikam

చేయూత పింఛన్లకు కొత్త దరఖాస్తుల స్వీకరణ. ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి: ఎంపీడీవో ఏ. రాములు.

Article Image

రామన్నపేట, ఆగస్టు 11: తెలంగాణ ప్రభుత్వం చేయూత సామాజిక భద్రత పింఛన్ల కింద కొత్త పింఛన్లు మంజూరు చేయనున్న నేపథ్యంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని రామన్నపేట ఎంపీడీవో ఆర్. రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలి దశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్‌సెల్‌ వ్యాధి, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వైకల్యాలతో బాధపడుతున్న వారికి చేయూత పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే గ్రామపంచాయతీ లేదా వార్డు కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. గతంలో దరఖాస్తు చేయని వారు, అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించని వారు సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.ఆగస్టు 31, 2026 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ఏ . రాములు కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News