Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:30 PM

నియో ప్రగతి పాఠశాలలో ఆషాఢమాస బోనాల వేడుకలు ఘనం

10-08-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలోని నియో ప్రగతి ఉన్నత పాఠశాలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని సోమవారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బోనాల పండుగ విశిష్టతను చాటిచెప్పారు.ఈ సందర్భంగా మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో పాఠశాలలో బోనాల వేడుకలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సతీమణి సుశీల విశ్వనాథ్, పాఠశాల కరస్పాండెంట్ కమ్మరి వెంకటరత్నం, ప్రిన్సిపల్ కమ్మరి ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని బోనాల ఉత్సవాలను విజయవంతం చేశారు.

Sthanikam

నియో ప్రగతి పాఠశాలలో ఆషాఢమాస బోనాల వేడుకలు ఘనం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News