Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

17వ వార్డును అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తాం: కౌన్సిలర్ ఉమామహేశ్వరి-సాయిలు

10-08-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు

ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి సహకారంతో పనులు

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్‌ల సహకారంతో చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని 17వ వార్డును అన్ని రంగాల్లో అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తామని వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు తెలిపారు. ​17వ వార్డు కౌన్సిలర్ ఉమామహేశ్వరి, కో-ఆప్షన్ సభ్యుడు పస్తం గంగరాములు పర్యవేక్షణలో వార్డులోని కల్లేట్ల నాగరాజు, వీరయ్య ఇళ్ల సమీపంలో విరిగి, ప్రమాదకరంగా మారిన రెండు పాత విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్త స్తంభాలను నాటించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. వార్డులో ఎదురవుతున్న విద్యుత్, ఇతర ప్రజాసమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రమాదకర స్థితిలో ఉన్న స్తంభాల వల్ల స్థానికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా నూతన స్తంభాలను ఏర్పాటు చేయించినట్లు పేర్కోన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మాదాని గోపాల్, 17వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.కె. యూసఫ్, వార్డు ప్రముఖులు కల్లేట్ల నాగరాజు, ఎర్రబోతు దయాకర్ రెడ్డి, ఎం.డి. తాజుద్దీన్, ఇమ్మడి ఈశ్వర్, రేవెల్లి రామచంద్రం, లైన్‌మెన్ తిరుమలేష్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

17వ వార్డును అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తాం: కౌన్సిలర్ ఉమామహేశ్వరి-సాయిలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News