Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:58 PM

కుమ్మరుల కులదైవానికి 201 బోనాలు!

కుమ్మరుల కులదైవానికి 201 బోనాలు!

కుమ్మరుల కులదైవానికి 201 బోనాలు!
10-08-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శ్రావణమాస తొలి బోనాల జాతరకు భారీ ఏర్పాట్లు.. 3 వేల మందికి పైగా కుమ్మరుల హాజరు

చిట్యాల, ఆగస్టు 10:

శ్రావణమాస తొలి బోనాల జాతరకు కుమ్మరులు భారీగా సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 16న ధర్వేశిపురం–నల్లగొండలోని సదాశివ ఫంక్షన్ హాల్‌లో శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి 201 బోనాలు సమర్పించనున్నారు. ఈ ఆధ్యాత్మిక వేడుకకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 3 వేల మందికి పైగా కుమ్మర్లు తరలిరానున్నారు.

జాతరను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో సోమవారం నకిరేకల్ నియోజకవర్గ చిట్యాల మండల అధ్యక్షుడు పాకాల దినేష్ ఆధ్వర్యంలో కులస్తులతో కలిసి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోనాల జాతరకు కుమ్మరులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో చిట్యాల టౌన్ 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీను, శ్రావణమాస బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ ఎగిరిశెట్టి అనిత, జిల్లా కమిటీ సభ్యుడు తాడూరి చంద్రం, మండల ప్రధాన కార్యదర్శి ఆర్రూరి నరసింహ, ఉపాధ్యక్షులు ఆర్రూరి శ్రీను, ఏరుకొండ నర్సింహ, పాకాల వెంకన్న, పాకాల సత్యనారాయణ, సిరిసినవాడ వెంకన్న, ఖమ్మంపాటి నర్సింహ, బొడ్డుపల్లి శ్రీను, బొడ్డుపల్లి ఉపేందర్, ఖమ్మంపాటి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

“మానవ నాగరికతకు కుమ్మరి తొలి మెట్టు.. కుండ ఆయువు పట్టు”

కుమ్మరి వృత్తి ప్రాధాన్యతను చాటుతూ, కులదైవం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

కుమ్మరుల కులదైవానికి 201 బోనాలు!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News