Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పేదలకు ప్రభుత్వ భూములు పంచాలి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 10, 2026 07:17 PM

విస్తారంగా వర్షాలు కురవాలి

విస్తారంగా వర్షాలు కురవాలి

విస్తారంగా వర్షాలు కురవాలి
10-08-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రైతాంగం సుభిక్షంగా ఉండాలి

నాగార్జునసాగర్‌లో వరుణ యాగం పూర్ణాహుతిలో పాల్గొన్న కాంగ్రెస్‌ నేతలు

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌ విజయవిహార్‌ ప్రాంగణంలో వరుణ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో నిర్వహించిన ఈ యాగంలో సోమవారం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. పూర్ణాహుతి కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పోతు భాస్కర్‌, సూర్యాపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొరిశెట్టి నివేదిత లక్షాది పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు, చెరువులు, కుంటలు నిండాలని, సాగునీటి వనరులు పుష్కలంగా లభించి రైతులు మంచి పంటలు పండించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. రైతాంగం సంతోషంగా, సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థించారు.

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వ్యవసాయానికి అవసరమైన నీరు అందుబాటులో ఉండాలని, రైతులకు ప్రకృతి అనుకూలంగా ఉండాలని నేతలు ఆకాంక్షించారు. వరుణ యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

విస్తారంగా వర్షాలు కురవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News