Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లోయపల్లి గౌడ సంఘం అధ్యక్షుడిగా కొండ సుధీర్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 10, 2026 08:33 AM

డెలివరీకి వెళ్లి యువకుడు అదృశ్యం.నాగోల్‌లో ఘటన.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు.

10-08-2026 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం, నాగోల్: డెలివరీ పని ఉందని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువకుడు తిరిగి ఇంటికి చేరకపోవడంతో అదృశ్యమైన ఘటన నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

నాగోల్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ కాలనీకి చెందిన సైదు భాగ్యరాజు జెప్టో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 4న డెలివరీ పని ఉందని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన భాగ్యరాజు ఆ తర్వాత తిరిగి రాలేదు.

దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల వద్ద ఆరా తీసినా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో భాగ్యరాజు భార్య రేవతి నాగోల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భాగ్యరాజు చివరిగా ఎక్కడికి వెళ్లాడు? ఎవరిని కలిశాడు? ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడాడా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఫోన్ కాల్ వివరాలతో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తూ యువకుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టినట్లు సీఐ తెలిపారు. ఆచూకీ లభించిన వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

Sthanikam

డెలివరీకి వెళ్లి యువకుడు అదృశ్యం.నాగోల్‌లో ఘటన.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు.

Article Image

స్థానికం, నాగోల్: డెలివరీ పని ఉందని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువకుడు తిరిగి ఇంటికి చేరకపోవడంతో అదృశ్యమైన ఘటన నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

నాగోల్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ కాలనీకి చెందిన సైదు భాగ్యరాజు జెప్టో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 4న డెలివరీ పని ఉందని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన భాగ్యరాజు ఆ తర్వాత తిరిగి రాలేదు.

దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల వద్ద ఆరా తీసినా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో భాగ్యరాజు భార్య రేవతి నాగోల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భాగ్యరాజు చివరిగా ఎక్కడికి వెళ్లాడు? ఎవరిని కలిశాడు? ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడాడా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఫోన్ కాల్ వివరాలతో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తూ యువకుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టినట్లు సీఐ తెలిపారు. ఆచూకీ లభించిన వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News