Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలి: ​సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

09-08-2026 158 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో 'ప్రజా చైతన్య యాత్ర'

చౌటుప్పల్ పరిధిలోని పరిశ్రమలలో స్థానిక నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రజా చైతన్య యాత్ర’ ఆదివారం చౌటుప్పల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్థానిక పరిశ్రమల వల్ల వందలాది ఎకరాల వ్యవసాయ భూములు, పంటలు, భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రకాలుగా నష్టపోతున్న స్థానిక యువతకు ఉపాధి కల్పించడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు. ​కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు నడుపుతున్నారని, ప్రమాదాలు జరిగినప్పుడు సమాచారం బయటకు రాకుండా చూస్తూ కార్మిక కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన పిసిబి (మార్గదర్శక నియంత్రణ మండలి) అధికారులు నామమాత్రపు తనిఖీలతో యాజమాన్యాలకే వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి యువతకు ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకోకపోతే, గ్రామీణ యువతను సమీకరించి పరిశ్రమల ఎదుట ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన నిత్యావసర ధరలను అదుపులోకి తెచ్చి పేదలను ఆదుకోవాలని, ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, బచ్చనగోని గాలయ్య, టీఎస్‌పీఎన్ఎమ్ రాష్ట్ర అధ్యక్షులు కురిమిద్దె శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు దుబ్బాక భాస్కర్, కలకొండ సంజీవ, చిలివేరు అంజయ్య, సుర్వి నర్సింహా, కొండూరి వెంకటేష్, బూడిగపాక జగన్, చలం పాండురంగరావు, ముత్యాల అంజయ్య, పిల్లి శంకరయ్య, ఉడుత రామలింగం, బద్దుల సుధాకర్, టంగుటూరు రాములు, రొండి నర్సింహా, దాసరి అంజయ్య, రోషణగారి అంజయ్య, గుడ్డేటి బిక్షపతి, కుంటి పాపయ్య, మనోహర్ ఏఐటీయూసీ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలి: ​సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News