నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిచ్కుందకు చెందిన శ్రీ ష. బ్ర. 108 సద్గురు సోమలింగ శివాచార్య మహా స్వామీజీ ఆలయానికి విచ్చేయగా, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామీజీని పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.
శ్రీ నల్లపచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న:శ్రీ ష. బ్ర. 108 సద్గురు సోమలింగ శివాచార్య మహా స్వామీజీ
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి