Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

గీత కార్మికుల బస్సు యాత్రకు ఘన స్వాగతం

గీత కార్మికుల బస్సు యాత్రకు ఘన స్వాగతం

గీత కార్మికుల బస్సు యాత్రకు ఘన స్వాగతం
08-08-2026 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పెండింగ్‌ ఎక్స్‌గ్రేషియా రూ.20 కోట్లు వెంటనే విడుదల చేయాలి

ఎల్లగిరిలో సన్మానించిన గౌడ సంఘం సభ్యులు

కల్లు గీత కార్మికుల హక్కుల రక్షణ కోసం మానుకోట నుంచి హైదరాబాద్ వరకు సాగుతున్న రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర బృందానికి చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో శనివారం ఘన స్వాగతం లభించింది. యాత్రలో భాగంగా విచ్చేసిన గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ, ప్రధాన కార్యదర్శులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, బి. జయరాములు, రగీరు కృష్ణల బృందాన్ని శ్రీ కంఠ మహేశ్వర గౌడ సంఘం సభ్యులు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.​ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు మారగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.20 కోట్ల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, భార్యకు పెన్షన్ ఇవ్వాలని, 50 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ.4,000 పెన్షన్ అందించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాటి, ఈత వనాల పెంపకానికి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని, నీరా సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.

​సంఘం ప్రధాన కార్యదర్శి మారగోని జంగయ్య మాట్లాడుతూ.. చెట్లను నరికే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కార్మికులకు 'కాటమయ్య రక్షణ కవచం' అందించాలని కోరారు. ఆగస్టు 18న సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు పల్సమ్ అంజయ్య, మారగోని దయాకర్, పెద్దులు, ప్రమీల, దేవేందర్, సత్యనారాయణ, వంగాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గీత కార్మికుల బస్సు యాత్రకు ఘన స్వాగతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News