Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:24 AM

తల్లి తండ్రుల మృతితో అనాధలైన పిల్లలు...

తల్లి తండ్రుల మృతితో అనాధలైన పిల్లలు...

తల్లి తండ్రుల మృతితో అనాధలైన పిల్లలు...
08-08-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

అసలే పేద కుటుంబం. కూలీ నాలీ చేసుకుంటే తప్ప డొక్కాడని దుస్థితి. ఉండేందుకు సరైన ఇల్లు కూడా లేని దయనీయ పరిస్థితి. అయితే విధికి కన్ను కుట్టిందో ఏమో కానీ ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. అనారోగ్యంతో ఐదు సంవత్సరాల కింద తల్లి, లివర్ ఇన్ఫెక్షన్ గుండె సంబంధిత వ్యాధుల వలన ఇటువలె తండ్రి చనిపోవడంతో ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారారు. సహృదయులు స్పందించి ఆదుకుంటే పిల్లల భవిష్యత్‌ బాగుపడుతుందని బంధువులు, గ్రామస్థులు కోరుతున్నారు. వివరాలకెళ్ళితే సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన గుండ్ల లింగయ్య (40) గుండ్ల సరిత (35) దంపతులకు లిఖిత (15)నికిత (16)ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలన చదువును మధ్యలో ఆపివేసి నానమ్మకు ఆసరాగా నిలిచిన అనాధ పిల్లలు *భార్య చనిపోవడంతో అన్నీ తానై* : మొదటగా భార్య చనిపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మూడు సంవత్సరాల కిందట భార్య అనారోగ్యంతో చనిపోవడంతో. కుటుంబానికి అండగా నిలిచి ఇద్దరు కుమార్తెలను వృద్ధురాలైన తన తల్లిని పోషించడంతో ఆ భారం అంతా తండ్రి పై పడింది. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. కూలీ చేస్తే వచ్చే డబ్బులతో కుటుంబం పూట గడవడం కూడా కష్టంగా మారింది.

*ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన తండ్రి* : తల్లి చనిపోయిన తర్వాత కూలీ పనులు చేసుకుంటూ పిల్లల ఆలనా పాలనా చూస్తున్న తండ్రి కూడా అనారోగ్యానికి గురై మూడు సంవత్సరాల క్రితం మరణించడంతో ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు ‌అనాథలుగా మారిపోయారు. తల్లిదండ్రులు ఇద్దరూ దూరం కావడం, సొంత ఇల్లు లేకపోవటం అంతా చిన్న పిల్లలు కావడంతో ఆ పిల్లల భవిష్యత్‌, పోషణ ప్రశ్నార్థకంగా మారిపోయింది... *నానమ్మ దిక్కు...* ఆ ఇద్దరు ఆడపిల్లలు చిన్న వయసులో ఉండగానే కొడుకు కోడలు అనారోగ్యం వలన మరణించడంతో గుండ్ల ఐలమ్మ 70 కూలి పనులు చేసుకుంటూ ఆ ఇద్దరు మనుమరాలని అన్ని తానై వారిని చదువుంచుకుంటూ పెంచి పోషిస్తుంది విధి ఆడిన నాటకంలో అన్నీ కోలిపోయిన ఆ పిల్లలకు మళ్లీ ఆ కష్టంలోకే నెట్టివేసింది ఇటీవల నానమ్మ కాలుకు తీవ్ర గాయం కావడంతో ఇరుగుపొరుగు వారి దగ్గర లక్ష రూపాయలు అప్పు చేసి ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పిచ్చి బాగు చేశారు ఆ అప్పు తీర్చుటకై చదువు మధ్యలోనే ఆపివేసి కూలీనాలు చేసుకుంటూ నానమ్మకు ఆసరాగా నిలిచారు కనీసం నివసిస్తున్న ఇల్లు కూడా సరిగ్గా లేక ఇల్లు వర్షాకాలానికి కురుస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం నానమ్మ మంచానికే పరిమితం కావడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.... *అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోలేదు* తల్లి తండ్రి మరణించిన తర్వాత అప్పట్లో ఉన్న కలెక్టర్ అనాధలైన ఆ ఇద్దరు పిల్లలకు అన్ని తానై ప్రభుత్వం తరఫున అన్ని విధాల అదుకుంటామని భరోసా కల్పిస్తామన్నారు కానీ ఎలాంటి సహాయాలు అందలేదు స్థానిక ఎమ్మెల్యే మందుల సామ్యూల్ దగ్గరికి వెళ్లిన తర్వాత వారు కూడా ఇల్లు కట్టిస్తామని ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు కానీ అది కూడా నెరవేరలేదు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు ఇప్పటికైనా ఆ అనాధ పిల్లలకు ఆసరాగా నిలిచి ఆదుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Sthanikam

తల్లి తండ్రుల మృతితో అనాధలైన పిల్లలు...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News