Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:00 PM

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం డిఎస్పి రవీందర్

07-08-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నమాత్‌పల్లి గ్రామంలోని స్వయంభూ శ్రీ పూర్ణగిరి సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ బి . రవీందర్ హాజరై ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ మాట్లాడుతూ.. ఆలయంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ఆలయాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ఆయన అన్నారు. ఆలయంలో చోరీలు జరిగినా, ఇతర అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకున్నా.. సీసీ కెమెరాల ద్వారా నిందితులను త్వరగా గుర్తించి, వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

అదేవిధంగా రెండోసారి ఆలయ చైర్మన్‌గా ఎన్నికైన రావి సురేందర్ రెడ్డి, నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యుల సహకారంతో ఆలయ పరిసరాల్లో ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి పోలీసు అధికారులను ఆహ్వానించినందుకు ఆలయ చైర్మన్‌ను డీఎస్పీ అభినందించారు.

అనంతరం ఆలయ చేర్మైన్ ఆలయానికి వచ్చే భక్తుల భద్రతతో పాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి రూరల్ సిఐ చంద్రబాబు,రూరల్ ఎస్సై లు అనిల్ కుమార్, కె. శివ శంకర్ రెడ్డి మరియు ఆలయ చైర్మన్ రావి సురేందర్ రెడ్డి, ధర్మకర్తలు సురపంగ శ్యామల వెంకటేష్, జిట్టా రాజిరెడ్డి, యెల్లంల నరసింహ యాదవ్, మట్ట బాలకృష్ణ గౌడ్, ఆలయ ప్రధానార్చకులు ఎక్స్ అఫిషియో మెంబర్ జ్యోషి పవన్ కుమార్ శర్మ, ఆలయ సేవకులు కొత్తపల్లి నాగయ్య మరియు భక్తులు పలువురు పాల్గొన్నారు

Sthanikam

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం డిఎస్పి రవీందర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News