Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:01 PM

నైతిక విలువలు, ఏఐ సాంకేతికతతో ప్రజాసంబంధాల రంగం ముందుకు సాగాలి.

07-08-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జాతీయ పీఆర్ విద్యా దినోత్సవ వేడుకల్లో మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, ఆగస్టు 6 (స్థానిక ప్రతినిధి):

ప్రజాసంబంధాల రంగం విశ్వాసం, నిజాయితీ, పారదర్శకత అనే విలువలను కాపాడుకుంటూనే కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలంగాణ కార్మిక, ఉపాధి, శిక్షణ, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. సీవీఎన్ పీఆర్ ఫౌండేషన్, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (PRSI) హైదరాబాద్ చాప్టర్ సంయుక్తంగా నిర్వహించిన 19వ జాతీయ పీఆర్ విద్యా దినోత్సవం వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పీఆర్ రంగ పితామహుడు డా. సి.వి. నరసింహారెడ్డికి ఘన నివాళులు అర్పించిన మంత్రి, ప్రజాసంబంధాల నిపుణులు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విశ్వసనీయంగా చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజలకు సమాచారం మరింత సమర్థవంతంగా అందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంబంధాల వ్యవస్థను బలోపేతం చేస్తోందని వెల్లడించారు. కీనోట్ స్పీకర్ డా. శ్రీరామ్ బిరుదవోలు మాట్లాడుతూ.. ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీల వేగవంతమైన విస్తరణ నేపథ్యంలో డీప్‌ఫేక్‌లు, ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారాన్ని సమర్థంగా ఎదుర్కొని ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడంలో పీఆర్ నిపుణుల బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజాసంబంధాల రంగంలో విశిష్ట సేవలందించిన పలువురికి జాతీయ అవార్డులు ప్రదానం చేశారు. పీఆర్ నిపుణులు, అధ్యాపకులు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులు సహా సుమారు 150 మంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sthanikam

నైతిక విలువలు, ఏఐ సాంకేతికతతో ప్రజాసంబంధాల రంగం ముందుకు సాగాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News