Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:07 AM

నారాయణ పాఠశాలలో ఆషాఢ బోనాల సంబరాలు..

నారాయణ పాఠశాలలో ఆషాఢ బోనాల సంబరాలు..

నారాయణ పాఠశాలలో ఆషాఢ బోనాల సంబరాలు..
07-08-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడలోని నారాయణ పాఠశాలలో ఆషాఢ మాసం సందర్భంగా బోనాల పండుగను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా విద్యార్థులు బోనాలు సమర్పించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు.

ఈ సందర్భంగా పోతురాజు వేషధారణలో విద్యార్థులు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డప్పుల చప్పుళ్ల మధ్య బోనాల ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. విద్యార్థులు తెలంగాణ జానపద సంస్కృతిని ప్రతిబింబించే నృత్య ప్రదర్శనలు ఇవ్వగా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ, విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

నారాయణ పాఠశాలలో ఆషాఢ బోనాల సంబరాలు..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News