Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:59 PM

చైతన్యపురిలో 'సహచరి' అవగాహన కార్యక్రమం

చైతన్యపురిలో 'సహచరి' అవగాహన కార్యక్రమం

చైతన్యపురిలో 'సహచరి' అవగాహన కార్యక్రమం
07-08-2026 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

150 మంది మహిళలకు చట్టాలు, సైబర్ భద్రతపై పోలీసుల అవగాహన

హైదరాబాద్, ఆగస్టు 7:

నగర పోలీసు కమిషనర్ (సీపీ) ఆదేశాల మేరకు మహిళల భద్రత, సాధికారత లక్ష్యంగా చేపట్టిన 'సహచరి' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 150 మంది సహచరి సభ్యులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ పనితీరు, మహిళలు, బాలికలకు సంబంధించిన చట్టాలు, మానవ అక్రమ రవాణా నిరోధం, సైబర్ నేరాల నివారణ, 'నేను సైతం 2.0' కార్యక్రమంపై అధికారులు సమగ్రంగా అవగాహన కల్పించారు.

సైబర్ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో 1930 సైబర్ హెల్ప్‌లైన్ వినియోగం, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలను వివరించారు. అలాగే సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేందుకు 'నేను సైతం 2.0' కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ (ఎస్‌ఓటీ) కె. మనోహర్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, ఏహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్ జి. రజిత రెడ్డి, చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే సీడీఈడబ్ల్యూ సభ్యులు, భరోసా ప్రతినిధులు, లయన్స్ క్లబ్ సైబర్ అవగాహన ఇన్‌చార్జి విజయ రాఘవ, జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు హాజరయ్యారు.

పోలీసులు మహిళల భద్రత కోసం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని, అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరాలను అరికట్టేందుకు సహకరించాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు.

Sthanikam

చైతన్యపురిలో 'సహచరి' అవగాహన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News