Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:11 PM

దానధర్మానికి నిదర్శనం.. ఆలయ నిర్మాణానికి రూ.20 లక్షల విలువైన నాలుగు గుంటల భూమి దానం

26-07-2026 298 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట మండలంలోని ఆత్మకూరు గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయానికి మాజీ సర్పంచ్ పట్లోళ్ల అమరేందర్ రెడ్డి సుమారు రూ.20 లక్షల విలువైన నాలుగు గుంటల భూమిని దానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఆయన సేవాభావాన్ని అభినందించారు. ఆలయ కమిటీ సభ్యుడు సంగమేశ్వర చారి మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి ఇంత విలువైన భూమిని దానం చేయడం ఎంతో గొప్ప విషయమని, అమరేందర్ రెడ్డి కుటుంబంపై స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గ్రామ సర్పంచ్ నికిత బింభదర్ చారి మాట్లాడుతూ, సంపద కంటే దానధర్మం గొప్పదని, గ్రామానికి ఆదర్శంగా నిలిచే ఈ భూదానం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

Sthanikam

దానధర్మానికి నిదర్శనం.. ఆలయ నిర్మాణానికి రూ.20 లక్షల విలువైన నాలుగు గుంటల భూమి దానం

Article Image

సదాశివపేట మండలంలోని ఆత్మకూరు గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయానికి మాజీ సర్పంచ్ పట్లోళ్ల అమరేందర్ రెడ్డి సుమారు రూ.20 లక్షల విలువైన నాలుగు గుంటల భూమిని దానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఆయన సేవాభావాన్ని అభినందించారు. ఆలయ కమిటీ సభ్యుడు సంగమేశ్వర చారి మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి ఇంత విలువైన భూమిని దానం చేయడం ఎంతో గొప్ప విషయమని, అమరేందర్ రెడ్డి కుటుంబంపై స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గ్రామ సర్పంచ్ నికిత బింభదర్ చారి మాట్లాడుతూ, సంపద కంటే దానధర్మం గొప్పదని, గ్రామానికి ఆదర్శంగా నిలిచే ఈ భూదానం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News