రామన్నపేట సెప్టెంబర్ 21
పట్టణంలోని బొడ్రాయి వద్ద ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భరతనాట్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాల్వేరు అశోక్ స్పాన్సర్‌గా వ్యవహరించారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రామన్నపేట ఎస్‌ఐ గోపాతి సతీష్, ఉప సర్పంచ్ మోటే రమేష్, జెల్ల వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. భరతనాట్య ప్రదర్శన ప్రజలను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు.
కార్యక్రమంలో వార్డు సభ్యులు రామస్వామి, గొరిగే శేఖర్, ఊట్కూరి భారతమ్మతోపాటు ఫ్రెండ్స్ యూత్ సభ్యులు బెదరకోట లక్ష్మణ్, నాగరాజు, శ్రీకాంత్, కల్లూరి నరేష్, మహేష్, వెంకటేష్, లింగస్వామి, అమరేందర్ రెడ్డి, వడ్లకొండ సాయి, శివ, అలిసెరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి