భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలు
విశేషంగా పాల్గొన్న గ్రామ ప్రజలు, భక్తులు
చిన్న కొండూరు గ్రామంలో గౌరీపుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా పలువురు దాతలు తమవంతు సహకారాన్ని అందించి సేవాభావాన్ని చాటుకున్నారు. విగ్రహ దాతలుగా కడారి సత్యనారాయణ–లత, కడారి లింగస్వామి–శ్వేత, లడ్డూ దాతగా మహ్మద్ మజీద్–సబేరా వ్యవహరించగా.. అన్నదాన కార్యక్రమానికి గరిశే లక్ష్మయ్య–ఆండాలు, గరిశే శ్రీను–శ్రీలత, సాయికిరణ్ సహకారం అందించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడమే మిన్నయని, గ్రామంలో ఐక్యత, సోదరభావాన్ని చాటేందుకే కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గౌరీపుత్ర యూత్ సభ్యుల సమన్వయంతో కార్యక్రమం విజయవంతం కాగా, దాతలను గ్రామస్థులు అభినందించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి