Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు బోర్డులు ఏర్పాటు చేయాలి అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 08:13 PM

ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు బోర్డులు ఏర్పాటు చేయాలి

21-09-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆర్‌డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఆర్‌టీఐ జేఏసీ నాయకులు

చౌటుప్పల్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) బోర్డులు, సిటిజన్ చార్టర్, పాలకవర్గ సభ్యుల వివరాల బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని ఆర్‌టీఐ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఆర్‌డీఓ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు గుంటోజు అంజయ్య చారి, మహమ్మద్ గౌస్, శ్యామ్ కుమార్ హాజరై అధికారులకు వినతిపత్రం అందజేశారు.​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పారదర్శక పాలన అందించడంలో భాగంగా ప్రజలకు సమాచార హక్కు చట్టం వివరాలు, కార్యాలయాల సేవలకు సంబంధించిన సిటిజన్ చార్టర్ స్పష్టంగా అందుబాటులో ఉండాలన్నారు. అదేవిధంగా, ప్రజాసౌకర్యార్థం ప్రతి ప్రభుత్వ అధికారి తప్పనిసరిగా తమ స్థానిక హెడ్‌క్వార్టర్స్‌ పరిధిలోనే నివాసం ఉండాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు బోర్డులు ఏర్పాటు చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News