తెలంగాణ ఉద్యమనేత, స్వాతంత్ర్య సమరయోధుడు, నిస్వార్థ ప్రజాసేవకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని సోమవారం వెల్లంకి గ్రామంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ విగ్రహానికి గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. బలహీన వర్గాల అభ్యున్నతికి బాపూజీ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
కార్యక్రమంలో వెల్లంకి పద్మశాలి సంఘం అధ్యక్షుడు మిర్యాల ఉపేందర్, వనం సత్తయ్య, ఈడెం శ్రీనివాస్, కొంగరి గోవర్ధన్, వనం పురుషోత్తం, వనం నరసింహ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి