Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 11:27 PM

శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు

20-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి.

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు శివనేనిగూడెం గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రుద్రవరం లింగస్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నకరికంటి మొగులయ్య, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్‌కుమార్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకుడు కన్నెబోయిన మహలింగం యాదవ్, నాయకులు వనం అంజయ్య, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డితో పాటు నాయకులను ఘనంగా సన్మానించారు. బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహానికి నాగం వర్షిత్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను సన్మానించారు.

ఈ సందర్భంగా నాగం వర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ.. శివనేనిగూడెం ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.

Sthanikam

శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News