Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్! అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 07:52 PM

చేతివృత్తిదారులను ప్రభుత్వం ఆదుకోవాలి. చేతివృత్తులను ఆధునీకరించి ప్రోత్సహించాలి: నారి ఐలయ్య.

20-09-2026 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కార్పొరేటీకరణతో రోజురోజుకూ కనుమరుగవుతున్న గ్రామీణ చేతివృత్తులను ప్రభుత్వం ఆధునీకరించి, తగిన ప్రోత్సాహం అందించి వృత్తిదారులను ఆదుకోవాలని చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు నారి ఐలయ్య డిమాండ్ చేశారు. ఆదివారం గంజి మురళి అధ్యక్షతన దొడ్డి కొమరయ్య భవన్‌లో నిర్వహించిన చేతివృత్తిదారుల జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఒకప్పుడు పల్లెలకు పట్టుగొమ్మలుగా ఉన్న చేతివృత్తులు మార్కెట్‌ దోపిడీ, మారుతున్న పరిస్థితులను తట్టుకోలేక కనుమరుగవుతున్నాయని ఐలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయిన వృత్తిదారులు జీవనోపాధి కోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

కల్లుగీత వృత్తిని ఆధునీకరించి, కల్లు ఉప ఉత్పత్తుల తయారీకి ఆర్థిక సహకారం అందించాలని కోరారు. గొర్రెలు, మేకల పెంపకందారుల కుటుంబాల్లోని నిరుద్యోగ యువతకు బ్యాంకు షరతులు లేకుండా ప్రభుత్వ షూరిటీతో గొర్రెల ఫారాలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలన్నారు. చేనేత కార్మికుల ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయడంతో పాటు కార్పొరేషన్‌ ద్వారా ఆర్థిక సహకారం అందించాలని సూచించారు.

మత్స్యకారులకు చేప పిల్లలను మధ్యవర్తులు లేకుండా నేరుగా అందించాలని, మత్స్య సొసైటీల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. రజక, నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్‌కు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించి, విద్యుత్‌ అధికారుల ఒత్తిడి నుంచి వారిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అన్ని చిన్నచిన్న చేతివృత్తులను ప్రోత్సహించి వాటి పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నారి ఐలయ్య కోరారు.

సమావేశంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చౌగాని సీతారాములు, అధ్యక్షుడు కొండా వెంకన్న, గొర్రెలు–మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య, దొంగరి వెంకన్న, నెలికంటి నరసింహ, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు కందగట్ల గణేష్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పొదిళ్ల శీను, చెరుకు పెద్దలు, మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఇటికాల ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పల గోపాలు, మొగుడు రాల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చేతివృత్తిదారులను ప్రభుత్వం ఆదుకోవాలి. చేతివృత్తులను ఆధునీకరించి ప్రోత్సహించాలి: నారి ఐలయ్య.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News