సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నారాయణఖేడ్‌కు చెందిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి. వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం జిల్లాలో పలువురు ప్రముఖ నాయకులు పోటీ పడగా, చివరకు నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డికి ఈ బాధ్యతలు దక్కాయి. ఆయనకు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉంది. 1990 నుంచి 1992 వరకు జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘ నాయకుడిగా, 1996 నుంచి 1999 వరకు యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2000 నుంచి 2005 వరకు యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు డీసీసీ కార్యదర్శిగా, 2015 నుంచి 2025 వరకు డీసీసీ ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సేవలందించారు. మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కృష్ణారెడ్డి కుమారుడైన చంద్రశేఖర్ రెడ్డి, ప్రస్తుత నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డికి సోదరుడు. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించిన చంద్రశేఖర్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కడంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ రెడ్డి నారాయణఖేడ్ నాయకుడికి జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి