Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ కోటాలో మెడికల్‌ సీటు. వనపర్తి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో చేరిన మేడిపల్లి యువతి. అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 11:56 AM

వెంపటి పాఠశాలలో నో బ్యాగ్ డే నిర్వహణ, బాలసభ, పింక్ కలర్ డే నిర్వహణ

20-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంపటిలో నో బ్యాగ్ డే, బాలసభతో పాటు పింక్ కలర్ డే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

నో బ్యాగ్ డే సందర్భంగా విద్యార్థులను పుస్తకాల భారానికి దూరంగా ఉంచి, వారి వయస్సుకు అనుగుణంగా ఆటలు, పాటలు, కథలు, పద్యాలు, క్విజ్, చిత్రలేఖనం, ఉపన్యాసం, అనుకరణ, సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.

బాలసభలో వారి నాయకత్వంలోవిద్యార్థులకు తమ ప్రతిభను స్వేచ్ఛగా ప్రదర్శించే అవకాశం కల్పించడం జరిగిందని. ప్రసంగాలు, పాటలు, పద్యాలు, కథలు, నృత్యాలు, వేషధారణలు తదితర కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమలోని సృజనాత్మకతను చాటుకున్నారని,పింక్ కలర్ డే సందర్భంగా విద్యార్థులు పింక్ రంగు దుస్తులు, వస్తువులతో పాల్గొన్నారు. పింక్ రంగును గుర్తించడం, పింక్ రంగులో ఉండే వస్తువులు, పువ్వులు తదితరాలను గుర్తించడం, పింకురంగు ప్రత్యేకతలు తెలిపే రైమ్స్ పాడడంవంటి కార్యకలాపాల ద్వారా విద్యార్థులకు రంగులపై అవగాహన కల్పించడం జరిగింది పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా అనుభవాల ద్వారా నేర్చుకునే అవకాశం కల్పించడం వల్ల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీవనపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ....విద్యార్థులు స్వయంగా పాల్గొని, పరిశీలించి, ఆలోచించి, అనుభవం ద్వారా నేర్చుకున్నప్పుడు ఆ జ్ఞానం జీవితాంతం గుర్తుండిపోతుందని,ప్రతి విద్యార్థిలో ఉన్న ప్రత్యేక ప్రతిభను గుర్తించి, దానికి తగిన అవకాశాలను కల్పించడం పాఠశాల బాధ్యతని,ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు, భవిష్యత్తులో బాధ్యతాయుతమైన, సృజనాత్మకమైన నాయకులుగా ఎదగడానికి దోహదపడతాయని అన్నారు

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మల్లెపాక రవీందర్, గట్టు మాధవి, బండారు భవాని, జీడి అనిల్ కుమార్, మిట్ట గడుపుల విక్రం, గుండ్ల ఆంజనేయులు, రామణబోయిన మౌనిక, అబ్బ గాని మంజులలు పాల్గొన్నారు.

Sthanikam

వెంపటి పాఠశాలలో నో బ్యాగ్ డే నిర్వహణ, బాలసభ, పింక్ కలర్ డే నిర్వహణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News