ఎల్బీనగర్‌లో జీవో 118 ధ్రువపత్రాల పంపిణీ
లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పత్రాలు అందజేత
ఎల్బీనగర్, సెప్టెంబర్ 20: ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జీవో 118 కింద ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్‌తో కలిసి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హాజరై లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందజేశారు. వేలాది మంది లబ్ధిదారులు తరలిరావడంతో స్టేడియం ప్రాంగణం సందడిగా మారింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించడం హర్షణీయమన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ధ్రువపత్రాల పంపిణీని వేగవంతం చేశారని తెలిపారు.
జీవో 118 ద్వారా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యలకు పరిష్కారం లభించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి