Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొంగరకలాన్‌లో వైభవంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 03:31 AM

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోటీ పరీక్షలకు 125 మందికి ఉచిత శిక్షణ – సబ్‌ కలెక్టర్‌ ఉమా హారతి

20-09-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ డివిజన్‌లో ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు నారాయణఖేడ్ సబ్‌ కలెక్టర్ ఉమా హారతి తెలిపారు. ఈ శిక్షణకు డిగ్రీ పూర్తి చేసి, ప్రస్తుతం నిరుద్యోగులుగా ఉన్న అభ్యర్థులు అర్హులని, మొత్తం 125 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 21 నుంచి 26వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నారాయణఖేడ్‌లోని సంబంధిత కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక కోసం సెప్టెంబర్‌ 28న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన వారికి పోలీస్‌ ఉద్యోగాల పోటీ పరీక్షలకు అవసరమైన అంశాలపై నిపుణులతో ఉచిత శిక్షణ అందించనున్నారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని పోలీస్‌ ఉద్యోగాలు సాధించే దిశగా కృషి చేయాలని సబ్‌ కలెక్టర్ ఉమా హారతి కోరారు.

Sthanikam

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోటీ పరీక్షలకు 125 మందికి ఉచిత శిక్షణ – సబ్‌ కలెక్టర్‌ ఉమా హారతి

Article Image

నారాయణఖేడ్ డివిజన్‌లో ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు నారాయణఖేడ్ సబ్‌ కలెక్టర్ ఉమా హారతి తెలిపారు. ఈ శిక్షణకు డిగ్రీ పూర్తి చేసి, ప్రస్తుతం నిరుద్యోగులుగా ఉన్న అభ్యర్థులు అర్హులని, మొత్తం 125 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 21 నుంచి 26వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నారాయణఖేడ్‌లోని సంబంధిత కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక కోసం సెప్టెంబర్‌ 28న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన వారికి పోలీస్‌ ఉద్యోగాల పోటీ పరీక్షలకు అవసరమైన అంశాలపై నిపుణులతో ఉచిత శిక్షణ అందించనున్నారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని పోలీస్‌ ఉద్యోగాలు సాధించే దిశగా కృషి చేయాలని సబ్‌ కలెక్టర్ ఉమా హారతి కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News