ఇ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్
డా.ఇరుగదిండ్ల భాస్కర్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో మున్సిపల్ పరిది లక్కారంలోని వివిఆర్ గార్డెన్ లో శనివారం ఈఎల్‌వీ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ఈ ఎల్ వి ఫౌండేషన్ చైర్మన్ డా:ఇరుగుదిండ్ల భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ మేళాకు 75కు పైగా కంపెనీలు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించగా 3000 మంది అభ్యర్థులు హాజరవ్వగా .. 500 మందికి పైగా అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. వివిధ ప్రైవేట్ సంస్థలు,కంపెనీల ప్రతినిధులు పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేశారు.యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈఎల్‌వీ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలను పలువురు అభినందించారు.ఈ సందర్భంగా ఈఎల్‌వీ భాస్కర్ మాట్లాడుతూ.. యువతలో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భవిష్యత్తులోనూ మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు,ఈ ఎల్ వి భాస్కర్ టీం,తదితరులు,పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి