Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఆర్‌ ప్రక్రియకు ప్రజలు సహకరించాలి.. వై. పండరి విజ్ఞప్తి అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 07, 2026 08:31 PM

జింకపిల్ల ప్రాణాలు కాపాడిన చౌకన్‌పల్లి యువరైతు

07-09-2026 107 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి మండల పరిధిలోని చౌకన్‌పల్లి గ్రామ శివారులో కాలు విరిగి తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జింకపిల్లను చౌకన్‌పల్లికి చెందిన యువరైతు రాజు కాపాడి అటవీశాఖ అధికారులకు అప్పగించారు.సోమవారం జింకపిల్లను గుర్తించిన రాజు వెంటనే కంగ్టి వెటర్నరీ ఆస్పత్రికి తరలించగా, స్థానిక ఎల్‌ఎస్‌ఏ వైద్యుడు బసవయ్య స్వామి ప్రథమ చికిత్స అందించి అవసరమైన ఇంజక్షన్లు చేశారు. అనంతరం సిర్గాపూర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాముకు సమాచారం అందించగా, ఆయన కంగ్టికి చేరుకుని జింకపిల్లను అటవీశాఖ ఆధీనంలోకి తీసుకున్నారు. జింకపిల్లకు మెరుగైన వైద్యం అందించి పూర్తిగా కోలుకున్న తర్వాత నారాయణఖేడ్ పార్కులో సురక్షితంగా వదిలిపెడతామని రాము తెలిపారు. గాయపడిన వన్యప్రాణిని గుర్తించి వెంటనే స్పందించి చికిత్స అందించిన యువరైతు రాజును స్థానికులు అభినందించారు.

Sthanikam

జింకపిల్ల ప్రాణాలు కాపాడిన చౌకన్‌పల్లి యువరైతు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News