రామన్నపేట,
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా రామన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి అధికారులకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. హామీల అమలు కోసం రాజ్యాంగబద్ధంగా నిరసన తెలిపిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బలవంతంగా అరెస్టు చేయడం సరికాదన్నారు.
మాజీ మంత్రులు, మహిళా నాయకులు ఉన్నారని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు.రాహుల్‌గాంధీ పార్లమెంట్ ఆవరణలో బ్లాక్ టీషర్ట్ ధరించి, రాజ్యాంగ పుస్తకం చేతిలో పట్టుకుని నిరసన తెలిపితే తప్పు కానప్పుడు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్ధంగా నిరసన తెలపడం ఎలా తప్పవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి హామీలు అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే వెంటనే అమలు చేయాలని, లేకుంటే పదవులకు రాజీనామా చేయాలని చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నీల దయాకర్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు బందెల రాములు పోషబోయిన మల్లేశం మాజీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు బొక్క మాధవరెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు కంభంపాటి శ్రీనివాస్ గర్దాస్ విక్రమ్ పులిపలుపుల వీరస్వామి గొలుసుల సత్తయ్య మాజీ ఎంపీటీసీలు సర్పంచులు వేమవరం సుధీర్ బాబు దోమల సతీష్ గాది పారిజాత ఎండి అమీర్ కోళ్ల స్వామి జిల్లా నాయకులు కన్నెబోయిన బలరాం ఎస్కే చాందు మందడి సాగర్ రెడ్డి పట్టణ కార్యదర్శి జాడ సంతోష్ నాయకులు మెట్టు శ్రీనివాస్ రెడ్డి బత్తుల వెంకన్న కాటేపల్లి యాదయ్య కోళ్ల కిషన్ మంటి లింగస్వామి జంగిలి నరసింహ నల్ల స్వామి తాళ్ల క్రాంతి కుమార్ చొప్పరి నరసింహ బండ శ్రీనివాస్ రెడ్డి మామిళ్ళ అశోక్ గంగుల రాఘవరెడ్డి గుండాల రాంబాబు నక్క నరేందర్ పులిగిల్ల పరమేష్ ఎండి అజాజ్ ఆవుల శ్రీధర్ జాల అమరేందర్ రెడ్డి నల్ల సైదులు రాస వెంకటేశ్వర్లు బలువుల కృష్ణగర్దాస్ కరుణాకర్ బత్తిని మహేష్ కూనూరు లింగస్వామి గాది శంకర్ మామిళ్ళ కుమార్ బాసాని రాజు బీరం రాజిరెడ్డి మందడి నర్సిరెడ్డి చలమల్ల బిక్షం రెడ్డి గట్టు శేఖర్ వంగాల సాయి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి