చిట్యాల బీజేపీ నేతల డిమాండ్.. కలెక్టరేట్‌లో వినతిపత్రం.
నల్గొండ, సెప్టెంబర్ 7: చిట్యాల పట్టణ ప్రజల ఆకాంక్ష మేరకు టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి కేటాయించిన భూమిని అదే ఉద్దేశంతో టీటీడీ కళ్యాణ మండపం పేరుపై మ్యుటేషన్ చేయాలని చిట్యాల బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా ఈ మేరకు అధికారులకు వినతిపత్రం అందజేశారు.
చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులోని సర్వే నంబర్ 649లో ఎకరం 12 గుంటల భూమిని టీటీడీ కళ్యాణ మండపం కోసం వినియోగించాలనే ఉద్దేశంతో పట్టణ ప్రజలు డబ్బులు సమకూర్చారని నాయకులు తెలిపారు. ప్రజలు ఏ లక్ష్యంతో భూమి కోసం సహకరించారో, అదే లక్ష్యంతో భూమిని టీటీడీ కళ్యాణ మండపం పేరుపై మ్యుటేషన్ చేయాలని కోరారు. ఈ విషయంలో అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని చిట్యాల పట్టణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సంత్ రవిదాస్ జయంతి ఉత్సవ కన్వీనర్ మాస శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరెళ్ల శ్రీను, జిల్లా కార్యవర్గ సభ్యుడు జయారపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి