Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలి అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 07, 2026 07:00 PM

వైద్య చికిత్సకు ఆర్థిక చేయూత.. సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత

07-09-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ ప్రత్యేక సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్ లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని సీఎంఆర్‌ఎఫ్ ద్వారా వైద్య చికిత్సలకు ఆర్థిక సహాయం అందిస్తూ బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తోందన్నారు. ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ వారి ప్రత్యేక చొరవతో నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా కలేరు రవి, రామావత్ సీతారాం, ర్యాకల రవీందర్ రెడ్డి, పార్శెట్టి సురేష్ కుమార్, తలారి మల్లయ్య, బిరాదార్ తనజీరావు, బర్మవత్ మమత, బుర్జుకాడి యాదుల్, సాగర్ సంజీవ్, విశ్లావత్ సుజాత బాయి, పట్లోల్ల విద్యావతి, రాథోడ్ లక్ష్మీ, అంగోత్ నరేష్, నాయకుని అనిత, బేగారి శోభా, ఉప్పరి సత్వ, మలకుమారి మల్లవ్వ, బర్డే స్వప్న, బాసడ వినోద్, గూడూరు బసమ్మ, గొల్ల సంగయ్య, మాస్టర్ రుద్రాంశ్, జానకంపల్లి రాజు, విశ్లావత్ మనూష్, పోగుల లక్ష్మీ, తెలుగు శోభా, ఈడిగి హేమలత, బాల్చుకూరి మవిత, మ్యాక్ శ్రీనివాస్ రెడ్డి, అదే మీరాబాయి, షేక్ అన్వర్ తదితర 31 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.11.12 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ ఆర్థిక సహాయం తమ వైద్య ఖర్చులకు ఎంతో ఉపయోగపడుతుందని లబ్ధిదారులు తెలిపారు. సీఎం సహాయ నిధి మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రి, ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్,మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్‌లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

వైద్య చికిత్సకు ఆర్థిక చేయూత.. సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News