చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ
మానవ హక్కుల పరిరక్షణ సంస్థ (HRCCI) 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ వడ్డేపల్లి నరసింహ, చౌటుప్పల్ డివిజన్ చైర్మన్ వడ్డేపల్లి శ్రీనివాస్, నాయకుడు గడ్డం జలంధర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సమాజంలో మానవ హక్కుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ, బాధితులకు అండగా నిలవడమే కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ వైష్ణవి, ఆసుపత్రి సిబ్బంది, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి