రాజాపేట జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయురాలికి జిల్లా స్థాయి అవార్డు ప్రదానం
అవార్డు ప్రదానం చేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, అధికారులు
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజాపేట జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో బయో-సైన్స్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎ. అనిత జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. శనివారం భువనగిరి కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, డీఈఓ బిక్షపతి, జెడ్పీ సీఈఓ శోభారాణి చేతుల మీదుగా ఆమె ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకని ఘన సన్మానం పొందారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, నైతిక విలువలను పెంపొందించడంలో ఆమె అందిస్తున్న విశేష సేవలకు గానూ ఈ పురస్కారం లభించింది. అవార్డు గ్రహీత అనిత మాట్లాడుతూ— "ఈ గౌరవం నా ఒక్కదానిదే కాదు. నా విద్యార్థుల ప్రేమ, తోటి ఉపాధ్యాయుల ప్రోత్సాహం, అధికారుల మార్గదర్శకత్వానికి దక్కిన ఫలితం. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే ఉపాధ్యాయ వృత్తికి నిజమైన సార్థకత. ఈ అవార్డు నాలో బాధ్యతను మరింత పెంచింది. నా ఈ గౌరవాన్ని పాఠశాలకు, విద్యార్థులకు అంకితం చేస్తున్నాను" అని భావోద్వేగంతో తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన అనితను టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఇ. మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సీహెచ్ పురుషోత్తమాచారి, డెక్కన్ క్రానికల్ యూనియన్ జనరల్ సెక్రటరీ కె. జగన్మోహన్‌రెడ్డి, జైకేసరం జెడ్పీహెచ్‌ఎస్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జే శ్రీనివాస్, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి