Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో కన్నులపండువగా ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 08:29 PM

దోపిడీకి పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం...పిల్లి రామరాజు యాదవ్

05-09-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

భూభారతిలో సెక్షన్ 22-Aను వెంటనే రద్దు చేయాలి...బీజేపీ నాయకుడు పిల్లి రామరాజు యాదవ్

నల్గొండ: భూభారతి చట్టంలో సెక్షన్ 22-Aను చేర్చి, రైతులు మరియు పేదల భూములపై హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీగా హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌కు తరలివెళ్లాయి. హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వి.ఎస్.ఎస్. రాంచందర్ రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరియు ఎంపీలు, ఎమ్మెల్యేల నేతృత్వంలో తలపెట్టిన ‘మహా ధర్నా’ను విజయవంతం చేసేందుకు నల్గొండ నుంచి సుమారు 30 కార్ల ర్యాలీతో వందలాది మంది కార్యకర్తలు బయలుదేరారు.

దోపిడీకి పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం...

​ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతిలో 22-A సెక్షన్‌ను చేర్చి పేదలు, రైతుల భూములను అమ్ముకునేందుకు వీలు లేకుండా ఆంక్షలు విధించిందని మండిపడ్డారు. ప్రైవేటు భూములను కూడా ప్రభుత్వ భూములుగా నమోదు చేస్తూ ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారని, ఈ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు.విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, ఆసరా పెన్షన్ల పెంపు అమలు చేయాలి. ఎస్సీ, బీసీ డిక్లరేషన్లను తక్షణమే అమలులోకి తీసుకురావాలి. నిరుద్యోగులకు కొత్త జాబ్ నోటిఫికేషన్లు జారీ చేయాలి. ఉద్యోగులకు పెండింగ్ డిఏ (DA), పీఆర్‌సీ (PRC) ప్రకటించడంతో పాటు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ నిధులను విడుదల చేయాలి.

కేంద్ర నిధులతోనే అభివృద్ధి పనులు..

​నల్గొండ నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే సాగుతున్నాయని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఒక్క రూపాయి కూడా లేదని స్పష్టం చేశారు. స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆచరణ సాధ్యం కాని మాటలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించే వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడలు వంచి పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, కార్పొరేటర్ అభ్యర్థులు ఉట్కూరు వెంకట్‌రెడ్డి, కందుల శ్రీను, శరత్, పట్టణ నాయకులు లకడాపురం వెంకటేశ్వర్లు, పెరికే నర్సింహ, దాసోజు యాదగిరిచారి, కటకం మహేష్, మండల అధ్యక్షుడు పర్సనబోయిన ఈశ్వర్ బిక్షం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బాకీ నర్సింహ, ఉపాధ్యక్షుడు దాసరి ఈశ్వర్, చింతపల్లి వెంకన్న, సుధాకర్ రెడ్డి, బోడిగే భారత్, రాజు, ముంత సైదులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దోపిడీకి పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం...పిల్లి రామరాజు యాదవ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News