మునుగోడుపై నిధుల వర్షం.. రేవంత్‌తో విభేదాల్లేవు...కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టీకరణ
నల్లగొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి రాజకీయ, వ్యక్తిగత విభేదాలు లేవని, ఆయనను తానెప్పుడూ దూషించలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఒకటి రెండు విధానపరమైన అంశాల్లో తప్ప, సీఎంతో తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని పేరొన్నారు.
రూ.2 వేల కోట్ల నిధుల మంజూరు...
మునుగోడు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. కొడంగల్, మధిర నియోజకవర్గాల తరహాలోనే మునుగోడుకు కూడా భారీగా నిధులు వచ్చాయని వెల్లడించారు. "ఇప్పటివరకు మునుగోడు అభివృద్ధికి ప్రభుత్వం రూ. 2,000 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో మౌలిక వసతులు, రహదారులు, తాగు, సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతాయి" అని ఆయన పేర్కొన్నారు.
బహిరంగ సభకు భారీగా తరలివెళ్తాం...
త్వరలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గం నుంచి వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులతో కలిసి సభకు హాజరవుతామని చెప్పారు. ఇక రాష్ట్రంలో రాబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై స్పందిస్తూ.. మంత్రిపదవుల కేటాయింపు అనేది కాంగ్రెస్ అధిష్టానం పరిధిలోని అంశమని, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి