Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి పాఠశాలలో కన్నులపండువగా కృష్ణాష్టమి వేడుకలు నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 04, 2026 04:33 PM

​శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో కాశీ శ్రీచక్రములపై ఘనంగా కుంకుమార్చన

04-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

హాజరైన మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్

భవాని నగర్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రావణమాసం నాలుగవ శుక్రవారం పురస్కరించుకుని కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో, ట్రినిటీ విద్యాలయాల సంస్థ, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సౌజన్యంతో ఈ వేడుకను నిర్వహించారు. ప్రత్యేకంగా కాశీ నుంచి తెప్పించిన శ్రీచక్రములపై మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన పూజలు చేశారు. వేద పండితులు పెద్ది సుధాకర్ శర్మ వేద మంత్రోచ్ఛరణల నడుమ ఈ కార్యక్రమం కన్నులపండువగా సాగింది. ​ఈ పూజా కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రీ భవాని మాత దివ్య ఆశీస్సుల కోసం కుంకుమార్చనలో పాల్గొన్న మహిళా భక్తులందరికీ అమ్మవారి కృపాకటాక్షాలు కలగాలని ఆకాంక్షించారు. చౌటుప్పల్ మున్సిపల్ ప్రజలంతా అమ్మవారి దయతో ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన దేవాలయ కమిటీ ధర్మకర్తలను ఆమె ఈ సందర్భంగా అభినందించారు.​ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి గురుస్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్, కౌన్సిలర్స్ పిల్లలమర్రి మధుసూదన్, బత్తుల వాణి విప్లవ్ గౌడ్, కాసర్ల మంజుల, కోఆప్షన్ సభ్యురాలు సందగళ్ళ విజయ, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అధ్యక్షురాలు వెన్ రెడ్డి సంధ్య, ట్రినిటీ విద్యాలయాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జీనీ మంజుల, పెద్ది స్వాతి కిషోర్ శర్మ, ధర్మకర్తలు వర్కాల రవి గౌడ్, ఆవుల యేసు యాదవ్, దాడి యశ్వంత్ రెడ్డి, గగులోతు అరుణ, బొబ్బిళ్ళ సంధ్య, వర్కాల వెన్నెల, పబ్బు శ్రీకాంత్ గౌడ్, మోగుదాల వెంకటేష్ గౌడ్, మునుకుంట్ల పద్మావతి, సుర్వి మంజుల, దాడి పద్మ, ముటుకులోజు నీరజ, వనం మమత, సింగిరి కొండశైలజ, బడుగు గౌరీశ్వరి, బొబ్బిళ్ళ యశోద, మన్నె శివరాణి, బొడిగ రాధిక, పగడాల అనూష, మామిడి వెంకటమ్మ, శాలిని, అనూష, ప్రసన్నలక్ష్మి, జూకంటి రేవతి, ఎలమొని హారిక, కాసాని ఐలమ్మ, కీర్తన, పార్సి సంధ్య, పార్షి నికిత, బొబ్బిళ్ళ సామ్రాట్, మునుకుంట్ల శేఖర్ గౌడ్, డాకోజి అజయ్ తదితర భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

​శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో కాశీ శ్రీచక్రములపై ఘనంగా కుంకుమార్చన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News