Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి పాఠశాలలో కన్నులపండువగా కృష్ణాష్టమి వేడుకలు నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 04, 2026 03:46 PM

సెప్టెంబర్‌ 10న ‘చలో హైదరాబాద్‌’ను విజయవంతం చేయాలి

04-09-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

లక్ష మందితో ఉద్యోగ హక్కుల సాధన సభ.. జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్‌.

నల్గొండ: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హక్కుల సాధన కోసం సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘ఉద్యోగ హక్కుల సాధన సభ–చలో హైదరాబాద్‌’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్‌ పిలుపునిచ్చారు. నల్గొండ పట్టణంలోని టీఎన్జీ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన నల్గొండ–సూర్యాపేట జిల్లాల TGEJAC సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్‌ అధికారులు, కార్మికులు, పెన్షనర్లు, అనుబంధ సంఘాల ప్రతినిధులతో భారీగా హైదరాబాద్‌కు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లో లక్ష మంది ఉద్యోగులతో భారీ సభ నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని నాయకులు తెలిపారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఉద్యోగులను తరలించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించారు.సమావేశంలో ఏలూరి శ్రీనివాసరావు, PRTU రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, TSUTF JAC కో-చైర్మన్‌ చావా రవి, TNGOs రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్‌ హుస్సేన్‌, అసోసియేట్‌ అధ్యక్షులు సత్యనారాయణగౌడ్‌, కస్తూరి వెంకటేశ్వర్లు, PRTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షం గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా TGEJAC భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు నాగిళ్ల మురళి అధ్యక్షతన సమావేశమై ఉద్యమ కార్యాచరణపై సమాలోచనలు చేశారు.ఐక్యతే బలం.. పోరాటమే మార్గం అనే నినాదంతో ఉద్యోగుల హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 10న ‘చలో హైదరాబాద్‌’ను చారిత్రాత్మక విజయంగా నిలపాలని పిలుపునిచ్చారు.

Sthanikam

సెప్టెంబర్‌ 10న ‘చలో హైదరాబాద్‌’ను విజయవంతం చేయాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News