టీజీజాక్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’
టీజీజాక్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’
NM Yadav
నల్లగొండలో గర్జించిన ఉద్యోగ సంఘాల సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’
నల్లగొండ: పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలు పోరుబాట పట్టాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌లో తెలంగాణ ఎన్జీవో (TNGO), తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అలసత్వం వహిస్తే రణరంగమే..!
సమావేశంలో మాట్లాడిన ఉద్యోగ సంఘాల నేతలు సర్కారు వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “సిపిఎస్ (CPS) రద్దు, పెండింగ్ డిఏల (DA) విడుదల, నూతన వేతన సవరణ కమిషన్ (PRC) అమలు, సార్వత్రిక ఆరోగ్య కార్డులు (Health Cards) అందించడం వంటి కీలక సమస్యలపై ప్రభుత్వం ఇంకా జాప్యం చేయడం తగదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలి” అని నాయకులు స్పష్టం చేశారు.
సిఎం సమక్షంలో సభ.. లేదంటే ఉద్యమ తీవ్రత!