Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పైప్‌లైన్ పగిలి.. వీధుల పాలైన తాగునీరు! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 04:39 PM

అక్రమంగా పశువుల రవాణా: ఐచర్ వాహనం సీజ్, 26 పశువుల రక్షణ

03-09-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పశువులను తరలిస్తున్న ఐచర్ డీసీఎం వాహనాన్ని గురువారం పోలీసులు పట్టుకున్నారు. ​స్థానిక ఎస్హెచ్‌ఓ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ నరేష్ (HC-2314), హోంగార్డు HG-92 సిబ్బంది పిఎం-2 విధులు నిర్వహిస్తుండగా, పశువుల అక్రమ రవాణా జరుగుతోందని విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు చౌటుప్పల్ పట్టణంలోని ధర్మోజీగూడెం క్రాస్ రోడ్ వద్ద వెంటనే వాహనాల తనిఖీలు చేపట్టారు. ​ఆ సమయంలో సందేహాస్పదంగా వచ్చిన ఐచర్ డీసీఎం వాహనాన్ని (TS 08UG 8181) ఆపి తనిఖీ చేయగా, అందులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 26 పశువులను (16 ఆవులు, 10 ఎద్దులు) గుర్తించి రక్షించారు.​వాహనాన్ని నడుపుతున్న హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ దమైగూడ ప్రాంతానికి చెందిన ఎస్‌కే ఇస్మాయిల్ (34)ను అదుపులోకి తీసుకుని విచారించారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం అన్నాయపేటకు చెందిన పశువుల యజమాని అసంతా వెంకన్న బాబు (55) సూచనల మేరకు జగ్గయ్యపేట సంతలో వీటిని కొనుగోలు చేసి, హైదరాబాద్‌లోని బహదూర్‌పురకు తరలిస్తున్నట్లు డ్రైవర్ తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు చౌటుప్పల్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

అక్రమంగా పశువుల రవాణా: ఐచర్ వాహనం సీజ్, 26 పశువుల రక్షణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News