కోర్టుకు వచ్చిన వివాహితతో ఏఆర్ కానిస్టేబుల్ సాన్నిహిత్యం
ఖమ్మం, సెప్టెంబర్ 2: కోర్టు వ్యవహారం కోసం వచ్చిన ఓ వివాహితతో పరిచయం పెంచుకుని అనుచితంగా మెలిగిన ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు వ్యవహారం ఖమ్మంలో కలకలం రేపింది. తన భార్యతో కానిస్టేబుల్ సన్నిహితంగా ఉంటున్నాడని ఆరోపిస్తూ ఆమె భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
కోర్టుకు వచ్చిన సమయంలో మహిళతో పరిచయం పెంచుకున్న రాంబాబు.. అనంతరం ఆమెతో సన్నిహితంగా మెలిగాడని భర్త ఆరోపించారు. భార్యపై అనుమానంతో నిఘా పెట్టిన ఆయన.. ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో పట్టుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తనపై కానిస్టేబుల్ దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
ఘటనకు సంబంధించిన ఆధారాలను అధికారులకు అందించినట్లు బాధితుడు తెలిపాడు. కానిస్టేబుల్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలు తేల్చి తగిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి