Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డేగుల్‌వాడిలో రైతుల పంటల నమోదు.. క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 05:02 PM

డేగుల్‌వాడిలో రైతుల పంటల నమోదు.. క్షేత్రస్థాయిలో పరిశీలన

02-09-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని డేగుల్‌వాడి గ్రామంలో పంట నమోదు కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) శ్వేత గ్రామంలోని రైతుల పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సాగు చేసిన పంటల రకం, విస్తీర్ణం తదితర వివరాలను నమోదు చేశారు. రైతులు తమ పంటలకు సంబంధించిన సరైన వివరాలను అధికారులకు అందించి నమోదు ప్రక్రియకు సహకరించాలని ఆమె సూచించారు. పంటల వివరాలు సక్రమంగా నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, రైతులకు అందే వివిధ ప్రయోజనాలు సకాలంలో అందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కరోబారి శ్రీనివాస్‌తో పాటు రైతులు బసాపురం మైపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సిద్ధార్థ్, చాకలి సంజు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో పంట నమోదు ప్రక్రియను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ కొనసాగిస్తున్నారు.

Sthanikam

డేగుల్‌వాడిలో రైతుల పంటల నమోదు.. క్షేత్రస్థాయిలో పరిశీలన

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని డేగుల్‌వాడి గ్రామంలో పంట నమోదు కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) శ్వేత గ్రామంలోని రైతుల పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సాగు చేసిన పంటల రకం, విస్తీర్ణం తదితర వివరాలను నమోదు చేశారు. రైతులు తమ పంటలకు సంబంధించిన సరైన వివరాలను అధికారులకు అందించి నమోదు ప్రక్రియకు సహకరించాలని ఆమె సూచించారు. పంటల వివరాలు సక్రమంగా నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, రైతులకు అందే వివిధ ప్రయోజనాలు సకాలంలో అందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కరోబారి శ్రీనివాస్‌తో పాటు రైతులు బసాపురం మైపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సిద్ధార్థ్, చాకలి సంజు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో పంట నమోదు ప్రక్రియను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News