కొత్తవాళ్లు వచ్చి కాంగ్రెస్‌ను కబ్జా చేయాలని చూస్తే ఊరుకోను.. సమయం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు: రాజగోపాల్‌రెడ్డి.
మునుగోడు: వైఎస్సార్ ఆశయాలే తనకు స్ఫూర్తి అని, ఆయన చూపిన బాటలోనే రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోని పరిణామాలు, భవిష్యత్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో వైఎస్సార్‌కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఆయన ఆశయాల కోసం నిరంతరం పాటుపడతానని చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్ శిష్యులమైన తాము ఆయనను మరవబోమని స్పష్టం చేశారు.
‘సీఎం.. సీఎం’ అంటున్నారు.. సమయం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన కొందరు కాంగ్రెస్‌ను కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించిన ఆయన.. అలాంటి ప్రయత్నాలను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనన్నారు.
నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూస్తానని రాజగోపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తానని, వైఎస్సార్ రాజ్యాన్ని తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవల కూడా రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో కొత్తగా చేరిన వారి ఆధిపత్యంపై, పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన నాయకులకు ప్రాధాన్యం తగ్గడంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి