తుంగతుర్తి;
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజాపాలనకు పెద్దపీట వేస్తూ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ 1000 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తూ ధర్నాలు, రాస్తారోకాలు చేస్తామని ప్రకటించడం సిగ్గుచేటని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ ముందు ఉన్న ఇనుప కంచెలను తొలగించి సామాన్య ప్రజలకు కూడా అసెంబ్లీ ప్రవేశానికి అవకాశం కల్పించిందన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, రైతు భరోసా పెంపు, రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు, మహిళల ఆధ్వర్యంలో బస్సులు, పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ప్రోత్సాహం, సన్న బియ్యం పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డుల వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువల పరిరక్షణతో పాటు ఆక్రమణల తొలగింపునకు హైడ్రా ద్వారా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం తగదన్నారు.ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు అసెంబ్లీకి సక్రమంగా హాజరు కాకపోయినా ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజాధనం ఖర్చవుతున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన బాధ్యత లేదా అని నిలదీశారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన గత పాలకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామెల్ ఎన్నికైన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువస్తున్నారని వెంకన్న పేర్కొన్నారు. వంద ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల వంటి ప్రతిష్టాత్మక అభివృద్ధి పనులను నియోజకవర్గానికి తీసుకురావడం అభినందనీయమన్నారు.వెనుకబడిన తుంగతుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందువరుసలో నిలిపేందుకు ఎమ్మెల్యే మందుల సామెల్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.బీఆర్‌ఎస్ నాయకులు వాస్తవాలను ప్రజలకు వివరించకుండా ధర్నాలు, రాస్తారోకాలు చేస్తామని ప్రకటించడం మానుకోవాలని చింతకుంట్ల వెంకన్న హితవు పలికారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి