Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ దాడులు అరాచకం ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 05:24 PM

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి.

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి.

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి.
01-09-2026 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్, సెప్టెంబర్ 1: సెప్టెంబర్ 1ని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. “పెన్షన్ భిక్ష కాదు.. పెన్షన్ హక్కు” అంటూ నినాదాలు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కళాశాల లైబ్రేరియన్ డా. ఏ. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. 2004 సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని, ఇందులో అనేక లోపాలు ఉన్నాయని అన్నారు. “పెట్టుబడుల పెన్షన్.. మాకొద్దు టెన్షన్” అంటూ ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 2.80 లక్షల మంది CPS ఉద్యోగులు ఉన్నారని, ఉద్యోగ విరమణ అనంతరం ఆశించిన స్థాయిలో పెన్షన్ అందక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగులకు భద్రత కల్పించే పాత పెన్షన్ విధానాన్ని (OPS) రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో టీజీసీజీటీఏ, టీజీసీటీఏ యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News