Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:08 PM

ఆటోను ఢీకొట్టిన టాటా ఏస్‌.. డివైడర్‌ ఎక్కిన గరుడ బస్సు!

31-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కేతేపల్లి జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు.. పలువురికి తీవ్ర గాయాలు.

కేతేపల్లి: నల్గొండ జిల్లా నకిరేకల్‌ నియోజకవర్గ పరిధిలోని కేతేపల్లి మండలంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట–హైదరాబాద్‌ జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-365పై జ్యోతి ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

సూర్యాపేట నుంచి నకిరేకల్‌ వైపు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన టాటా ఏస్‌ వాహనం ఢీకొట్టడంతో ఆటో అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ గరుడ బస్సు ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కింది. దీంతో ప్రయాణికుల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ప్రమాదంలో గాయపడిన వారిని 108 అంబులెన్స్‌ ద్వారా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న కేతేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Sthanikam

ఆటోను ఢీకొట్టిన టాటా ఏస్‌.. డివైడర్‌ ఎక్కిన గరుడ బస్సు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News