POCSO కేసులో ఆటో డ్రైవర్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష...
బాధితురాలికి ₹7 లక్షల పరిహారం మంజూరు...
తీర్పు వెలువరించిన నల్లగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు...
నల్లగొండ : చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడికి కోర్టు కఠిన శిక్ష ఖరారు చేసింది. దిండి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న POCSO, అత్యాచారం కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ₹5,000 జరిమానా విధిస్తూ నల్లగొండ ఫాస్ట్ ట్రాక్ (రేప్ అండ్ POCSO) కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాలను పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు.డిండి మండలం ప్రతాప్‌నగర్ గ్రామానికి చెందిన ముదావత్ మల్లేష్ (23), వృత్తిరిత్య ఆటో డ్రైవర్. బాధితురాలిపై అక్రమానికి పాల్పడటంతో డిండి పోలీసులు అతనిపై IPC సెక్షన్లు 376(2), 506తో పాటు POCSO చట్టం (2012) సెక్షన్ 5 r/w 6 కింద కేసు (క్రైమ్ నం. 97/2020) నమోదు చేశారు.
నిరూపితమైన నేరం – శిక్ష వివరాలు..
అధికారులు సేకరించిన పక్కా ఆధారాలు, సాక్ష్యాలను కోర్టులో సమర్పించి, ప్రాసిక్యూషన్ తరఫున వాదనలను బలంగా వినిపించడంతో నిందితుడిపై మోపిన అభియోగాలు రుజువయ్యాయి. కేసు విచారించిన గౌరవ న్యాయమూర్తి నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ క్రింది తీర్పునిచ్చారు...IPC 376(2) కింద 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష (Rigorous Imprisonment), 5,000 రూపాయలు జరిమానా. జరిమానా చెల్లించని పక్షంలో మరో 3 నెలల సాధారణ కారాగార శిక్ష (Simple Imprisonment) అనుభవించాలి. బాధితురాలికి ₹7,00,000 పరిహారంగా అందించాలని న్యాయస్థానం ఆదేశించింది.
పోలీస్, ప్రాసిక్యూషన్ కృషి...
ఈ కేసులో డిండి హెడ్ కానిస్టేబుల్ ఎం. రాములు మొదటి దర్యాప్తు అధికారిగా, దిండి సీఐ డి. వెంకటేశ్వర్లు రెండవ దర్యాప్తు అధికారిగా వ్యవహరించి సాక్ష్యాధారాలు సేకరించారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ ప్రాసిక్యూషన్ తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించగా, భరోసా సెంటర్ లీగల్ ఆఫీసర్ ఎం. కల్పన బాధితురాలికి న్యాయ సహకారం అందించారు. కోర్టు డ్యూటీ అధికారులు కె. కృష్ణ, పి. లింగయ్య, లైజన్ అధికారులు పి. నరేందర్, ఎన్. మల్లికార్జున్ ప్రాసెస్ నిర్వహణలో సమన్వయం వహించారు. ప్రస్తుతం దిండి సీఐ కె. బీసన్న, ఎస్ఐ చి. బాలకృష్ణ కోర్టు ప్రక్రియలను పర్యవేక్షించారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాల్లో నిందితులకు త్వరగా శిక్ష పడేలా, బాధితులకు వేగంగా న్యాయం జరిగేలా పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి