నారాయణఖేడ్ నారాయణఖేడ్ పట్టణంలోని స్థానిక ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ సామాజిక నాయకులు బాపు మల్లశెట్టి కుమార్తె ఆరాధ్య నూతన వస్త్రధారణ మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ రహీం, నారాయణఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గైని సాయిలు హాజరై ఆరాధ్యను ఆశీర్వదించి, బాపు మల్లశెట్టి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆరాధ్య ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, మానూర్ మండల మాజీ అధ్యక్షులు సుభాష్ రావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
ఆరాధ్య నూతన వస్త్రధారణ వేడుకలో పాల్గొన్న అబ్దుల్ రహీం, గైని సాయిలు

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి