చెరువుగట్టు: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో కొలువైన పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని జర్నలిస్టులు ఆలయాన్ని దర్శించుకుని స్వామివారికి అభిషేకం, అర్చన తదితర పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు జర్నలిస్టులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానికం పత్రిక సబ్ ఎడిటర్ కొమిడాల మహేందర్ రెడ్డి, ప్రజా దర్బార్ జిల్లా స్టాఫర్ గుండ్లపల్లి వెంకన్న, విజన్ ఆంధ్ర కరస్పాండెంట్ చేన్నోజు శేఖర్, క్రైం మిర్రర్ రిపోర్టర్ దేశగాని సాయి పాల్గొన్నారు.
సోమవారం భక్తుల రద్దీ
పురాతన చరిత్ర కలిగిన చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి క్షేత్రానికి ప్రతి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి